టాప్ రేటింగ్‌తో దూసుకుపోతున్న తెలుగు న్యూస్ ఛాన‌ల్ ఎన్టీవీ (Ntv) మ‌రో అరుదైన ఘ‌న‌త సాధించింది. ఏకంగా ప్ర‌ధాన మంత్రితో ఇంట‌ర్వ్యూ చేసిన‌ ప్రాంతీయ ఛాన‌ల్‌గా కొత్త రికార్డు సాధించింది. ఎన్టీవీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ప‌దేళ్ల కాలంలో దేశంలో సాధించిన ఘ‌న‌త‌ల‌ను, తన మనసులోని మాటల‌ను ఈ సంద‌ర్భంగా ప్రధాని మోడీ ఎన్టీవీతో పంచుకోనున్నారు. ఈ రోజు రాత్రి 8 గంటలకు ప్రధాని ఎన్టీవీకి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇస్తున్నారు. పార్ల‌టెంట్‌ ఎన్నికల వేళ బిజీ షెడ్యూల్‌లో కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఎన్టీవీకి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. గతంలో ఎన్టీవీ ఆధ్వ‌ర్యంలోని భక్తి టీవీ నిర్వహించిన కోటి దీపోత్సవానికి విశిష్ట అతిథిగా ప్రధాని మోడీ హాజరయ్యారు.

ఎన్నికలు స‌మీపించిన ఈ కీలక సమయంలో ఎన్టీవీకి ప్రధాని ఇంటర్వ్యూ ఇవ్వడం సంచ‌ల‌న‌మే అని చెప్పొచ్చు. ఈ క్ర‌మంలో ఎన్టీవీ దేశ టెలివిజన్‌ చరిత్రలోనే అరుదైన ఘనతను సాధించింద‌ని చెప్పొచ్చు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో జరుగుతున్న కీలక పరిణామాలపై ప్రధాని మోడీ సమాధానమివ్వనున్నారు. ప్రజల మెదళ్లలో నానుతున్న ఎన్నో ప్రశ్నలు, ప్రచారంలో ఉన్న మరెన్నో సందేహాలపై తెలుగు ప్రజల తరపున ఎన్టీవీ ప్రశ్నించనుంది. ఒకే ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రధాని మోడీ దగ్గర కానున్నారు. సంచ‌ల‌నం సృష్టించ‌బోతున్న ఇంట‌ర్వ్యూ  ఈ రోజు రాత్రి 8 గంటలకు చూడ‌వ‌చ్చు.

  • ప్రధాని మోడీతో ఎన్టీవీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి

By Live24

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *