పోలీస్ కమాండ్ కంట్రోల్ భవనాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించారు. హైద‌రాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్‌ నెంబర్ 12లో ఇంటిగ్రేటెడ్‌ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంది. రాష్ట్రంలో అన్ని శాఖలను సమన్వయం చేస్తూ అంతర్జాతీయ ప్రమాణాలతో పోలీస్ టవర్స్‌ను నిర్మించారు. పర్యవరణహిత భవనంగా నిర్మించిన ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు చాలా ప్రత్యేకతలున్నాయి.

https://www.youtube.com/watch?v=sTSYEwrs8Zs

కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా తెలంగాణ వ్యాప్తంగా డేగ కన్నుతో పోలీసుల పహారా ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని శాఖలను సమన్వయం చేస్తూ.. జీ-ప్లస్ 20 అంతస్తుల్లో ఈ టవర్ ను ఏర్పాటు చేశారు.
కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మొత్తం ఐదు టవర్లు ఉన్నాయి. టవర్‌ Aలో ఇరవై అంతస్తులను నిర్మించారు. ఇందులోనే సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఉంది. టవర్‌ A పైభాగంలో హెలిప్యాడ్ నిర్మించారు. టవర్‌ Bలో 15 అంతస్తులు ఉన్నాయి. ఇందులో టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్ ఉంది. టవర్‌ C లో మూడు ఫ్లోర్‌లు ఉన్నాయి. ఇందులో ఆడిటోరియంగా పోలీసులు వినియోగిస్తారు.

టవర్‌ Dని మీడియా అండ్ ట్రైనింగ్ సెంటర్‌ కోసం ఉపయోగిస్తారు. మొత్తం ఇంటిగ్రేటెడ్‌ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో టవర్ A, టవర్ B కీలకంగా ఉంటుంది. టవర్‌ Eలో కమాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంటర్, సీసీ టీవీ మానిటరింగ్, వార్ రూమ్ ఉన్నాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి హైదరాబాద్ నగరాన్ని 360 డిగ్రీల కోణంలో చూసే వెసులుబాటు ఉంది. కమాండ్ కంట్రోల్‌ రూమ్‌లో ప్రత్యేక మ్యూజియం ఉంది. పోలీస్ డిపార్టమెంట్‌ ఎలా పని చేస్తుందో తెలుసుకోవ‌చ్చు. ఈ కమాండ్ సెంటర్ భవనాన్ని లక్షా 12 వేల 77 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ప్రదేశాన్ని 360 డిగ్రీల కోణంలో పోలీస్ రాడార్ పరిధిలోకి వస్తుంది. ఈ బిల్డింగ్ అందుబాటులోకి వస్తే రాష్ట్రంలోని ఏ ప్రదేశంలో ఏం జరిగినా కూడా క్షణాల్లో కనిపెట్టొచ్చు అని పోలీసులు అంటున్నారు. ఈ భవనం నిర్మాణం కోసం 585 కోట్ల రూపాయ‌ల భారీ వ్యయంతో కేటాయించారు. ఈ భవనాన్ని 7 ఎకరాల్లో 7 లక్షల చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో 4 బ్లాకుల్లో A, B, C, D కమాండ్ కంట్రోల్ సెంటర్ టవర్లు నియమించారు. టవర్-A గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 84.2 మీటర్ల ఎత్తులో ఉంటుంది. టవర్-B, C, Dలు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 65.2 మీటర్ల ఎత్తులో నిర్మించారు. ఇందులో ముఖ్యమైంది ఆఫీస్ బిల్డింగ్ టవర్-A. హెలిప్యాడ్‌తో కలిపి జీ ప్లస్ 20 అంతస్తుల్లో టవర్-A నిర్మించారు. ఓపెన్ ఆఫీస్ మీటింగ్ రూమ్స్ కాన్ఫరెన్స్ రూం క్యాబిన్లు ఈ ట‌వ‌ర్‌లో ఉన్నాయి.

పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు కావాల్సిన డేటా సెంటర్ పరికరాలు జర్మనీ, బెల్జియం నుంచి తెప్పించారు. దీన్నుంచి సేవలు ప్రారంభమైతే.. సిటీలోని అన్ని సీసీ కెమెరాలను ఈ కేంద్రం నుంచి పోలీస్ అధికారులు పర్యవేక్షిస్తారు. ఇందుకు ఓ ఫ్లోర్‌లో భారీ ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. మొత్తానికి అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకున్న ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ హైదరాబాద్‌ మహానగరానికి మరో మణిహారం నిలుస్తుందని చెప్పొచ్చు.

By Live24

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *